Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తన భర్తతో సన్నిహితంగా ఉంటుందని
- యువతిపై సామూహిక లైంగికదాడి
- రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఓ మహిళ అరాచకం
- వీడియోలు తీసి బెదిరింపులు
- మహిళ, నలుగురు యువకుల అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
నవతెలంగాణ-మియాపూర్
రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భర్తతో ఓ యువతి సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతో ఓ మహిళ.. నలుగురు యువకులతో కలిసి యువతిని కిడ్నాప్ చేయించి.. లైంగికదాడి చేయించింది. ఈ అమానుష ఘటన.. బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లోని శ్రీరామ్‌నగర్ కాలనీలో నివసించే గాయత్రి, శ్రీకాంత్ దంపతులు, బాధితురాలు ఒకే కాలనీలో నివాసముంటున్నారు. కాగా, బాధితురాలు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో శ్రీకాంత్ కూడా ప్రిపేర్ అవుతుండటంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది. వారి మధ్య సన్నిహిత్యాన్ని చూసిన శ్రీకాంత్ భార్య గాయత్రి వారి మధ్య వివాహేతర సంబంధం ఉందని భావించింది. గాయత్రి మరో నలుగురు యువకులతో కలిసి ఈనెల 26న బాధితురాలిని కిడ్నాప్ చేయించింది. ఆమెను నిర్బంధించి నోట్లో గుడ్డలు కుక్కి తీవ్రంగా హింసించారు.
యువకులు బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘతకాన్ని నిందితురాలు గాయత్రి తన సెల్ఫోన్లో వీడియో తీసింది. దాడి ఘటనపై ఎవరికైనా చెబితే వీడియాను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించింది. అయితే అక్కడి నుంచి తప్పించుకున్న యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఈ ఘటనకు కారణమైన మహిళ గాయత్రితో పాటు యువకులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ నెల 26న జరిగిన ఈ ఘటన పోలీసుల దృష్టికి వచ్చినప్పటికీ విషయం బయటకురాకుండా గోప్యత పాటించారు. పోలీసులు దాచి ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.