Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 రోజులుగా శివన్నగూడ ప్రాజెక్టు వద్ద చర్లగూడ ముంపు గ్రామస్తుల దీక్ష
నవతెలంగాణ-మర్రిగూడ
20 రోజులుగా పరిహారం కోసం దీక్ష చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక పరిహారం రాదన్న ఆందోళనతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శిన్నగూడిపాజెక్టు వద్ద ఆధివారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. శిన్నగూడ ప్రాజెక్టు వద్ద చర్లగూడ ముంపు గ్రామస్తులు 20 రోజులుగా దీక్ష చేస్తున్నారు. పునరావాసం, నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం వారు అక్కడే ఉండి వంటావార్పు చేస్తున్నారు. ఎనిమిది రోజుల కింద కలెక్టర్ వారిని తన కార్యాలయానికి పిలిపించి వారితో మాట్లాడారు. చెక్కులను ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దాని ఊసేలేదని వాపోయారు. కలెక్టర్ మాట తప్పారని, ఇక తమకు న్యాయం జరగదన్న భయంతో దీక్ష చేస్తున్న సమయంలో నాగిళ్ళ లక్షమ్మ (50)కు బీపీ ఎక్కువై అస్వస్థతకు గురైంది. దాంతో నిర్వాసితులు మర్రిగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం కేంద్ర ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. క్రమంలో మార్గమధ్యలో లక్ష్మమ్మ మృతి చెందింది. లక్ష్మమ్మ గతంలో వార్డుసభ్యునిగా గెలుపొంది గ్రామస్తులకు సేవలందించారు. మృతురాలికి భర్తతో పాటు కుమారుడు ఉన్నారు.