Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు
నవతెలంగాణ - గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేయాలని కాలుష్య నియంత్రణ మండలి (పీఎస్బీ) ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి నదీ జలాల కలుషితంతో పాటు పలు అంశాలను నోటీసులో ప్రస్తావించింది. నిర్మాణం పూర్తయిన కర్మాగారం లాంఛనంగా ప్రారంభించకున్నా ఏడాది కాలంగా కర్మాగారంలో యూరియా ఉత్పత్తి చేస్తున్నారు. పరిశ్రమ నుంచి అమ్మోనియా లీక్ వల్ల కొన్నాళ్లుగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా డస్ట్ కలెక్షన్, రికవరీ సిస్టం లేకపోవడంతో కర్మాగారం నుంచి వెలువడుతున్న అమ్మోనియా గ్యాస్‌తో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ఎరువుల కర్మాగారం నుంచి శుద్ధిచేయని వ్యర్థ జలాలను నేరుగా వదలడంతో గోదావరి నది కలుషితం అవుతుందని, యాజమాన్యం కలుషిత నివారణ చర్యలు చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పీసీబీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు నేపథ్యంలో పీసీబీ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి గ్యాస్ లీక్ అవుతుందనిచ కర్మాగారం నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలను గోదావరి నదిలో కలుస్తున్నాయని, కనీస నిబంధనాలు పాటించడం లేదని ప్లాంట్ వల్ల కాలుష్యం పెరిగిపోయిందని టాస్క్‌ఫోర్స్ తమ నివేదికలో పేర్కొన్నారు. ఈక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కర్మాగారం ఉత్పత్తి ఆపివేయాలని ఆదేశాలను జారీ చేసింది. ప్రధానంగా కార్మికులకు తగిన వైద్య సదుపాయాలు కల్పించలేదని, ఉత్పత్తయిన అమ్మోనియా నిల్వ చేయడానికి సరైన స్థలం లేదని, పూర్తిస్థాయిలో కార్మికులకు వైద్య సేవలు అందుబాటులో లేవని పీసీబీ ఆరోపణ. కర్మాగారానికి సరైన బాధ్యులను నియమించలేదని.. అధిక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్న దృష్ట్యా తగు చర్యలు చేపట్టాలని పీసీబీ సూచి ంచింది. అందుకనుగుణంగా గ్యారంటీ సొమ్ము రూ.12లక్షలను అధికారులు జప్తు చేశారు. ఇండిస్టీ కాలుష్య నియంత్రణ బోర్డు ప్రమాణాలను పాటించడంలో విఫలం అయినందున వాటర్ ప్రివెన్షన్, పొల్యూషన్ కంట్రోల్ యాక్టు 1988 ప్రకారం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేయాలని పీసీబీ నోటీసులో స్పష్టం చేసింది.