Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజెర్సీ టీటీఏ సదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణా అమెరికా తెలుగు సంఘం మేఘా కన్వెన్షన్‌ను ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవీయ కోణాన్ని ఆవిష్కరించే రీతిలో ప్రకతిని ఆరాధించే అద్భుతమైన బతుకమ్మ సంప్రదాయం తెలంగాణకే సొంతమన్నారు..బతుకమ్మ తో పాటు బోనాలు,గ్రామదేవతల పేరుతో నిర్వహించే జాతరల ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఎన్నో వ్యయ ప్రయసాల కొనర్చి తెలంగాణా ఉనికిని అమెరికాలో చాటేందుకు తెలంగాణా అమెరికా తెలుగు సంఘం కృషి చేసున్నదని కొనియాడారు. కార్యక్రమంలో టీటీఏ చైర్మెన్ మోహన్ రెడ్డి టీఆర్ఎస్్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.