Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- కరీంనగర్లో ఆల్ మండల్ హమాలీ యూనియన్ జిల్లా మహాసభలు
నవతెలంగాణ-కరీంనగర్ టౌన్
హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్టు ఏర్పాటు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రా భవన్లో ఆల్ మండల్ హమాలీ యూనియన్ జిల్లా మహాసభలు పిల్లి రవి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సభలకు పాలడుగు భాస్కర్ హాజరై మాట్లాడారు. ప్రజలకు నిత్యావసర సరుకులు సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న హమాలీ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికుల ఉపాధి రక్షణ కోసం సమస్యలను యూనియన్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మహాసభల ద్వారా ప్రభుత్వానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, ప్రతి రేటుకి ప్రభుత్వమే బాధ్యత వహించి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించినా.. హమాలీ కార్మికులకు పోటీగా తక్కువ రెట్లుతో వలస కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకున్నారని తెలిపారు. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కోసర భవిష్యత్తు ఛలో హైదరాబాద్ లాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఐకేపీ సెంటర్స్ వద్ద హమాలీ కార్మికులకు రూ.80లు ఇవ్వాలని, ఐకేపీ హమాలీ గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, సరైన వసతి, తాగునీటి సౌకర్యం, మందులు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. సభలో సీఐటీయూ నాయకులు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.