Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొబైల్ షాప్ యజమాని ఆశ్చర్యం
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ఖాతాదారునికి తెలియకుండానే తన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అకౌంట్లో రూ.18 కోట్ల 52 లక్షలు జమయ్యాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ పట్టణానికి చెందిన వెంకట్‌రెడ్డి మొబైల్ షాప్ నిర్వాహకుడు. అతని అకౌంట్లో రూ.18 కోట్ల 52 లక్షల పైన పడ్డాయి. వెంకట్‌రెడ్డి ఆదివారం ఉదయం తన బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటే.. పెద్దమొత్తంలో నగదు చూసి ఆశ్చర్యానికి గుర య్యాడు. అప్పటికే తన అకౌంట్లో రూ.2 లక్షలు ఉండగా, తను ఎవరికీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా వెళ్లకపోవడం, తనకు ఎవరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా రాకపోగా.. ఓటీపీ మాత్రమే వచ్చిందని వెంకట్‌రెడ్డి తెలి పారు. దీంతో వెంటనే వికారాబాద్ బ్రాంచ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికా రులకు సమాచారం ఇచ్చారు. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయమని అధికారులు సలహా ఇవ్వడంతో కస్టమర్ కేర్‌కి ఫోన్ చేయగా, సోమవారం ఉదయం బ్యాంక్‌కి వెళ్లి ఆధార్ కార్డ్, పాన్ కార్డు వివరాలు ఇవ్వాలని చెప్పారు. ఆయన సోమవారం బ్యాంక్‌కు వెళ్లి అధికారులను సంప్రదించారు. సంకేతిక లోపంతో ఇలా జరిగి ఉంటుందని గుర్తించారు. అకౌంట్‌ను ఫ్రీజ్ చేసినట్టు చెప్పారు. తన బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఉన్నా, ఎలాంటి ట్రాన్స్ఫర్.. విత్‌డ్రా కావడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.