Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి మల్లారెడ్డిపై దాడి
- టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ టీఆర్ఎస్ ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతోనే మంత్రి మల్లారెడ్డిపై దాడి చేశారని టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయా వర్గాలను మోసం చేసిన సీఎం కేసీఆర్ను మంత్రి పొగుడుతుంటే సహజంగా వచ్చిన ఆవేశమే దాడికి కారణమని చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. మంత్రి మల్లారెడ్డిపై దాడిని కేసీఆర్ కుటుంబ పాలనపై జరిగిన దాడిగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్పై తిరగపడే రోజులు మొదలయ్యాయని హెచ్చరించారు. అది మల్లారెడ్డిపై జరగాల్సిన దాడి కాదనీ, కేసీఆర్పై జరగాల్సిందని అన్నారు.