Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్‌కి జగ్గారెడ్డి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీమేరకు ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలను ఎప్పుడేస్తారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుని ప్రశ్నించారు. డబ్బులు జమచేసే వరకు తాము ఇలానే ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ వచ్చినప్పుడు తెలంగాణ అభివద్ధికి ప్రత్యేక ప్యాకేజి అడిగే ప్రయత్నం చేశారా? అంటూ సంజరుని ప్రశ్నించారు. ఆయన మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే, ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.