Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వచ్చే అసెంబ్లీ (2023) ఎన్నికల కోసం కాంగ్రెస్ తన పార్టీ విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం జూన్ 1, 2 తేదీల్లో ఆ పార్టీ 'నవ సంకల్ప చింతన్ శిబిర్' నిర్వహించనుంది. ఇందుకోసం మేడ్చల్ జిల్లా కీసరలోని బాలవికాస్ కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లను సీఎల్పీనేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శిగా బోసురాజు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వరరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి లు పరిశీలించారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతోపాటు ఏఐసీసీ నేతలు హాజరు కానున్నారు. దాదాపు 150 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఆరు గ్రూప్‌లకు సంబంధించిన ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, జగదీష్, డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ తదితరులు ఉన్నారు.