Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ విద్యలో సీఈసీ, హెచ్ఈసీ కోర్సుల్లో ఐచ్చిక సబ్జెక్టుగా సివిక్స్ (పొలిటికల్ సైన్స్) ఉంటుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పొలిటికల్ సైన్స్ సబ్జెక్టును తొలగిస్తున్నట్టు కొన్ని పత్రికల్లో ప్రచారం జరుగుతున్నదని తెలిపారు. దానిపై ఆయన పై విధంగా స్పందించారు. ఇంటర్ బోర్డు ఎప్పటికప్పుడు సమాజ అవసరాలను బట్టి కొత్త కోర్సులు, సబ్జెక్టులను పరిచయం చేస్తుందని వివరించారు. ఈ ప్రక్రియలో ఏ సబ్జెక్టునూ తొలగించ బోదని తెలిపారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టును తొలగించే ప్రతిపా దన ఏ స్థాయిలోనూ ఏ సమయంలోనూ ఆలోచన చేయలేదని స్పష్టం చేశారు.