Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ) ప్రథమ సంవత్సరం విద్యార్థుల పరీక్షలు జులై నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు సోమవారం షెడ్యూల్ను విడుదల చేశారు. డీఎడ్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల పరీక్షలు జులై తొమ్మిదో తేదీ వరకు జరుగుతాయని వివరించారు.