Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ స్టడీ సర్కిల్లో వివిధ గ్రూపులకు శిక్షనా తరగతులు ప్రారంభం కానున్నట్టు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె అలోక్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్-1 కోచింగ్ కోసం హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో, సైదాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్లో పోలీసు కానిస్టేబుల్ కోసం శిక్షణా తరగతులు జూన్ ఒకటో నుంచి ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించామని తెలిపారు. డిగ్రీ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ఉచిత శిక్షణ 100 మంది అభ్యర్థులకు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఇంటర్ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైన 150 మంది పోలీసు కానిస్టేబుల్‌కు శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్టు తెలిపారు. సంవత్సర ఆదాయం రూ. 5లక్షలకంటే తక్కువ ఉన్న అభ్యర్థు తమ ఆదాయ, కుల దృవీకరణ పత్రాలతో పాటు విద్యార్హతల పత్రాలతో రావాలని పేర్కొన్నారు. టీఎస్పీఎస్ గ్రూప్-1 దరఖాస్తుదారులు బీసీ స్టడీ సర్కిల్ ఓయూ క్యాంపస్, పోలీసు కానిస్టేబుల్ దరఖాస్తులవారు బీసీ స్టడీ సర్కిల్ సైదాబాద్ హైదరాబాద్‌లో సమర్పించాలని తెలిపారు. వివరాల కోసం 040-24071178,040-27077929 సంప్రదించాలని కోరారు.