Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పూర్తయిన పనులకు పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి శ్వేతపత్రం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. సర్పంచులు పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, మధ్యాహ్న భోజనం తదితర సంక్షేమ పథకాల్లో బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించాలని కోరారు.