Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రస్థాయికి 45 గ్రూప్ లు
- మంత్రుల చేతుల మీదుగా బహుమతులు : బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లలిత కళలు చిన్నారుల్లో ఏకాగ్రతను, మానసిక ప్రశాంతతను పెంచుతాయని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా బీసీ హాస్టల్ విద్యార్థులకు ప్రత్యేకంగా నృత్యపోటీలను జిల్లా స్థాయిలో నిర్వహించామని తెలిపారు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వివియోగం చేసుకునేలా ఈ పోటీలు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఎంతో ఆసక్తిగా పాల్గొన్న విద్యార్థులు జిల్లా స్ఠాయిలో ప్రదర్శనలు ఇచ్చారనీ, వారి నుంచి జిల్లాకు రెండు గ్రూప్‌ల చొప్పున ఫైనల్ కు ఎంపిక చేశామని తెలిపారు. సాహిత్యాన్ని, కళలను రేపటి తరానికి అందించాలంటే ఈతరం పిల్లలకు వాటిని చేరువ చేయాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగే గ్రాండ్ ఫినాలేలో జిల్లాల నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన జట్లు పాల్గొంటాయని, ముగ్గురు న్యాయనిర్ణేతలు ఇచ్చే మార్కుల ఆధారంగా ఆరు జట్లను ఫైనల్‌గా ఎంపిక చేస్తారని వివరించారు. వారిలో మొదటి, రెండో, మూడో బహుమతులతోపాటు మరో ముగ్గురికి కన్సోలేషన్ బహుమతులను రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.