Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ జిల్లా టీబీ నిర్మూలన అధికారి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
క్షయ రోగులకు ప్రస్తుతం అందిస్తున్న ఉచిత టీబీ నిర్ధారణ పరీక్షలు, మందులు, ప్రతి నెల పోషణ భత్యం రూ. 500లతో పాటు అదనపు సహాయాన్ని అందించాలని నిర్ణయించినట్టు హైదరాబాద్ జిల్లా క్షయ నిర్మూలన అధికారి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదనంగా బియ్యం, పప్పులు, నూనె లాంటి పదార్థాలు, పౌష్టికాహారం, వృత్తిపరమైన శిక్షణ, ఇతర రోగ నిర్ధారణ తదితర సేవలు అందివ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సహాయాన్ని ఏడాదిపాటు అందిస్తామని వివరించారు. సహాయం కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా గాని, లేదా సమ్మతి పత్రాన్ని సంతకం చేసి టీబీ కార్యక్రమ అధికారులకి సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు గూగల్ ప్లే స్టోర్ నుంచి టీబీ ఆరోగ్య సాథి (టీబీ ఆరోగ్య సాథి) యాప్ను వారి మొబైల్లో పొందుపరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజా ప్రతినిధులను, ఔత్సాహిక దాతలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంస్థలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో లేక ఒక టిబి యూనిట్ స్థాయిలో టిబి రోగులకు సంస్థలు లేదా దాతలు సేవలు అందించడానికి అవకాశం కల్పించినట్టు చెప్పారు.