Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులను కూడగట్టి 16 నెలలపాటు ఢిల్లీని దిగ్భంధించి ఆందోళన చేసి ప్రధాని మోడీతో క్షమాపణలు చెప్పించిన రైతు నేత రాకేష్తికాయత్పై దాడి చేయడం హేయమైన చర్య అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అని పేర్కొన్నారు. ఆయనపై బెంగుళూరులో కొంత మంది అగంతకులు సిరాతో దాడిచేయడాన్ని మంత్రి ఖండించారు. ఈ దాడి వెనక ఎవరున్నా చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కిరాతకమైన చర్య: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ
రైతు నేత టికాయత్‌పై ఇంకుతో దాడి చేయడం కిరాతకమైన చర్య అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ అభిప్రాయపడ్డారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూడు వ్యవసాయ చట్టాల వల్ల కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకునేంతవరకు ఏడాదికాలంపాటు అకుంఠిత దీక్షతో పోరాడిన రైతు నాయకుడు రాకేష్ టికాయత్ అని గుర్తు చేశారు. దాడికి పాల్పడిన దోషులపై విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.