Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా
- అశోక్‌కుమార్, రవీందర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నికైంది. సోమవారం టీపీటీఎఫ్ రాష్ట్ర వార్షిక కౌన్సిల్ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఎన్నికల అధికారిగా కె నారాయణ, పరిశీలకులుగా కె వేణుగోపాల్ సమక్షంలో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. టీపీటీఎఫ్ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా వై అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ముత్యాల రవీందర్, అదనపు ప్రధాన కార్యదర్శిగా పి నాగిరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్ తిరుపతి, డి శ్రీనివాస్, పి నారాయణమ్మ, పి మహేందర్‌రెడ్డి, ఎం కృష్ణారెడ్డి, ఎ భాస్కర్‌రెడ్డి, కార్యదర్శులుగా కడారి భోగేశ్వర్, ఎస్ కనకయ్య, ఆర్ రమేష్, ఎం రాములు, జి ఎల్లయ్య, ఎ భుజంగరావు, ఎస్ కవిత ఎన్నికయ్యారు. ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా కె యాదగిరి, సభ్యులుగా జి రఘుపతి యాదవ్, ఎం లక్ష్మయ్యయాదవ్, కార్యవర్గ సభ్యులుగా డి ఉమాబాలచందర్, డి సమ్మయ్య, పొన్నమల రాములు, ఎండీ ఖమ్రుద్దీన్లు ఎన్నికయ్యారు. ఉపాధ్యాయులు వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన ఉందని టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌కుమార్, రవీందర్ తెలిపారు. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ప్రకటనలు అమల్లోకి రావడం లేదని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.