Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాదర్బార్‌కు అనుమతి లేదన్న పోలీసులు
- టీఆర్ఎస్, బీజేపీ నాయకుల అరెస్ట్.. 30 యాక్ట్ అమలు
- కామారెడ్డి జిల్లా కేద్రంలో ఉద్రిక్తత
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్
వెంచర్లు, అవినీతి అరో పణలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్న టీఆర్ఎస్, బీజేపీ నాయకులు సోమవారం తల పెట్టిన ప్రజాదర్బార్ ఉద్రిక్తంగా మారింది. అనుమతి లేదని పోలీసులు ఇరు పార్టీల నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు నిర్వహించారు. ఉదయం 9:30 పది గంటల మధ్య టీఆర్ఎస్ పార్టీ నాయకులు నెట్టు వేణుగోపాలరావు, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మున్సిపల్ కార్యాలయంలోనికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం వారిని దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మీడియాతో నెట్టు వేణుగోపాలరావు మాట్లాడుతూ.. దమ్ముంటే అవినీతిపై చర్చించడానికి రావాల్సిన బీజేపీ నాయకులు ప్రజాదర్బార్‌కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
నిజాంసాగర్ చౌరస్తా వద్ద బాధితులతో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు రమణారెడ్డిని, బాధితులను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించగా.. వాగ్వాదం జరిగింది. ఏవైనా ఉంటే కోర్టుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. అనంతరం అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.