Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు వీఆర్ఏ జేఏసీ నేతల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏలకు పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు ఇప్పించాలని మంత్రి హరీశ్‌రావును వీఆర్ఏ జేఏసీ నేతలు కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని కోకాపేటలోని మంత్రి స్వగృహంలో ఆయనకు వారు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి, వీఆర్ఏ సంఘాల జేఏసీ చైర్మెన్ జి.రాజయ్య, కో-చైర్మెన్ రమేశ్ బహదూర్, కో-కన్వీనర్ వంగూరు రాములు, వెంకటేష్ యాదవ్, మాధవ్‌రావు, తదితరులు పాల్గొన్నారు. అర్హత కల్గిన వారికి ప్రమోషన్స్ ఇస్తామని ప్రకటించి రెండేండ్లవుతున్నా నేటికీ ఇచ్చిన హామీలు అమలుకాలేదని తెలిపారు. దీంతో వీఆర్ఏలంతా ఆందోళన చెందుతున్నారనే విషయాన్ని మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, తీవ్ర పని భారం, చాలీచాలని వేతనాలతో వీఆర్ఏలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీఎం ప్రకటించిన పే-స్కేల్ జీఓను విడుదలకు, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని విన్నవించారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..'సమస్య న్యాయమైంది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. హుజూరాబాద్‌లో హామీ ఇచ్చిన విషయం కూడా నాకు గుర్తుంది. సీఎం కేసీఆర్‌తో చర్చించి త్వరలో పరిష్కారం చేసేందుకు కృషి చేస్తాను' అని హామీనిచ్చారు.