Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఆర్ఎంబీ చైర్మెన్‌కు ఈఎన్సీ లేఖ
నవతెలంగాణ ప్రత్యే ప్రతినిధి-హైదరాబాద్
కష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) చైర్మెన్‌కు రాష్ట్ర సాగునీటి పారుదల అభివృద్ధి, ఆయకట్టు శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ మంగళవారం పలు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పంప్డ్ హైడ్రో స్టోరేజీ పథకాలపై ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే కష్ణా నదిపై ఏపీ పంప్డ్ స్టోరేజీ పథకాలను చేపట్టిందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతుల్లేని ప్రాజెక్టులను నిలువరించాలని, తద్వారా తెలంగాణ అన్యాయం జరగకుండా చూడాలని కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేశారు. ఏపీ చేపట్టిన అన్ని పంప్డ్ స్టోరేజ్ పథకాల వివరాలు తెప్పించి తమకు ఇవ్వాలని బోర్డును కోరారు. కర్నూల్ జిల్లా పిన్నాపురం వద్ద చేపట్టిన గ్రీన్ కో విద్యుత్ ప్రాజెక్టుపై కూడా మరో ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ప్రాజెక్టు కోసం కష్ణా జలాలను వినియోగించరాదని సూచించారు. ఈమేరకు ఇంజినీర్ ఇన్ ఛీఫ్ మురళీధర్ మంగళవారం రెండు లేఖలను వేర్వేరుగా రాశారు.