Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వర్దమాన తెలుగు కవయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరేట్‌కు అంతర్జాతీయ లిటరరీ ఫెస్టు ఆహ్వానం అందింది. ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్‌లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ, సాహిత్య అకాడమీ జూన్ 18 నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో ఈ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ రచయితలు, కవులు, విమర్శకులు, పరిశోధకులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో ''వై డూ ఐ రైట్'' అనే అంశంపై నిర్వహించే చర్చలో పాల్గొనేందుకు రావాలని కేంద్ర సాహిత్య అకాడమీ మెర్సీ మార్గరేట్ ను ఆహ్వానిస్తూ లేఖ రాసింది.