Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఒక కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ టీఎస్ఎస్పీడీసీఎల్ బంజారాహిల్స్ సర్కిల్‌కు చెందిన ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్లు ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డారు. ఏసీబీ డీజీ అంజనీ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భాస్కర్ రెడ్డి అనే ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్‌కు కొత్తగా విద్యుత్ మీటర్లు బిగించడానికి అవసరమైన ఇండ్ల సంఖ్యను కేటాయించడానికి గానూ టీఎస్ఎస్పీడీసీఎల్ బంజారాహిల్స్ సర్కిల్లోని సనత్‌నగర్ డివిజన్ ఏఈ అవినాశ్ రూ.10 వేలను, లైన్ ఇన్స్పెక్టర్ కృపానందరెడ్డి రూ.7500 లను ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేశారు. ఇందులో రూ.3000 లను కృపానందరెడ్డి, రూ. 10 వేలను ఏఈ అవినాశ్‌లు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు కాపు కాసి రెడ్‌హ్యాండె డ్గా పట్టుకున్నారు. వీరి నుంచి లంచం సొమ్మును స్వాధీనం పర్చుకొని అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం వారిని జైలుకు తరలించారు.