Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కార్యదర్శికి టీపీయూఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను మంగళవారం హైదరాబాద్లో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో పర్యవేక్షక పోస్టులైన డిప్యూటీఈవో, ఎంఈవోలు లేని కారణంగా విద్యాప్రమాణాలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మండలాల్లో ఎఫ్ఏసీలతో నడుస్తున్న కారణంగా పాఠశాల విద్యారంగం ఇబ్బందులకు గురవుతున్నదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్, జీహెచ్ఎం, ఎంఈవో, డిప్యూటీఈవో పోస్టులకు అర్హతగల ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చేందుకు షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడిబాట ప్రారంభం కన్నా ముందే బదిలీల షెడ్యూల్ను ప్రకటించాలని కోరారు. 317 జీవో వల్ల ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. 402 జీవోపై ఉన్న న్యాయపరమైన ఇబ్బందులను తొలగించి ఉపాధ్యాయులకు సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించాలంటూ జీఏడీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చారు. ఈ కుబేర్లో ఉన్న పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలంటూ ఆర్థిక శాఖ కార్యదర్శికి మరో వినతిపత్రం సమర్పించారు.