Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 మందిని అడ్డుకున్న అధికారులు
నవతెలంగాణ-కోదాడరూరల్
ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలలో ఒకరికి బదులుగా మరొకరు రాసేందుకు వచ్చిన విద్యార్థులను పరీక్షాకేంద్రాల వద్ద అధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగింది. వివరాల్లోకెళ్తే..
పట్టణంలోని సీసీరెడ్డి విద్యానిలయం, బార్సు హైస్కూల్, కేఆర్ఆర్ జూనియర్ కాలజీల్లో ఓపెన్ పరీక్షల సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే, ఓపెన్ స్టడీ సెంటర్ల నిర్వాహకులు ఒకరికి బదులు మరొకరితో పరీక్షలు రాయిస్తున్నారని వాట్సాప్‌లలో మెసేజ్‌లు వెల్లువెత్తాయి. దీనికి తగినట్టుగానే పరీక్షల తొలిరోజు కావడం, తమను ఎవరూ గుర్తించరనే దీమాతో కొందరు విద్యార్థులకు బదులు ఇతరులు రాసేందుకు వచ్చారు. ఈ అంశంపై అప్పటికే ఓపెన్‌స్కూల్ సొసైటీ అధికారులు పరీక్షాకేంద్రాల అధికారులను అప్రమత్తం చేయడంతో వచ్చిన వారిని అడ్డుకుని పంపించారు. సీసీరెడ్డి విద్యానిలయంలో 30 మంది విద్యార్థులను గుర్తించి పరీక్ష రాయకుండా అడ్డుకున్నారు. వీరిని బయటకు పంపించి మొదటి హెచ్చరికగా వదిలివేశారు. ఇదే తరహాలో మిగిలిన పరీక్షలు కూడా ఒక విద్యార్థికి బదులు ఇంకొక విద్యార్థి రాసే అవకాశం వుందని, దీనిని అధికారులు అడ్డుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.