Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బుధ, గురువారాల్లో మేడ్చిల్ జిల్లా కీసర మండలంలో జరగనున్న నవసంకల్ప్ చింతన్ శివిర్‌ను విజయవంతం చేసేందుకు ఆరు కమిటీలు ఏర్పాటు చేసినట్టు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ కమిటీ కన్వీనర్‌గా పొన్నాల లక్ష్మయ్య, పొలిటికల్ కమిటీ కన్వీనర్‌గా ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎకానమీ కన్వీనర్‌గా దూద్దిళ్ల శ్రీధర్‌బాబు, అగ్రికల్చర్ కన్వీనర్‌గా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సోషల్ జస్టిస్ కన్వీనర్‌గా వి.హనుమంతరావు, యూత్ కన్వీనర్‌గా దామోదర్ రాజనర్సింహను నియమించినట్టు తెలిపారు. ఆరు తీర్మానాలపై చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.