Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షలో మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్రిస్టియన్లకు సంబంధించిన శ్మశాన వాటికల (బరియల్ గ్రౌండ్ ) ఏర్పాటు కోసం హైదరాబాద్ చుట్టుపక్కల కేటాయించిన స్థలాల్లో అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆ శాఖ అధికారుతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటికల కోసం రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో 10 చోట్ల కోట్ల రూపాయల విలువ చేసే 60ఎకరాల భూమి కేటాయించాలని గుర్తు చేశారు. వాటికి '' క్రైస్తవ స్మృతి వనం''అని బోర్డు పెట్టాలని సూచించారు. వాటి చుట్టూ ప్రహారీ ఏర్పాటు చేయాలనీ, వాచ్‌మెన్‌ను నియమించాలనీ, విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించి లైట్లు బిగించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతివెస్లీ తదితరులు పాల్గొన్నారు.