Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశ స్వాతంత్య్రం ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని బీజేపీకి జాతీయ జెండా మారుస్తామనడం సరైందికాదని మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్పారు. జాతీయ జెండాను మార్చే హక్కు ఆ పార్టీకి లేదన్నారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశాన్ని హిందూదేశంగా మార్చుస్తామంటే తాము వ్యతిరేకిస్తామన్నారు.