Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర యోగాధ్యాయన పరిషత్ కు పాలక మండలిని తిరిగి నియమించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి చైర్మెన్‌గా,కార్యదర్శి వైస్ చైర్మెన్‌గా,తెలంగాణ రాష్ట్ర యోగాధ్యాయన పరిషత్ కార్యదర్శి సభ్య కార్యదర్శిగా, మరో ఎనిమిది మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటా రు. మొత్తం 11 మందితో కమిటీని ఏర్పాటు చేశారు.