Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నీరా అనుబంధ ఉత్పత్తులపై అధ్యయనానికి ఒక కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగ ళవారం హైదరాబాద్‌లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఎక్సైజ్, టూరిజం శాఖల అధికారులతో పాటు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముడ్విన్లోని పైలెట్ ప్రాజెక్టులో నీరా సేకరణ, బాటిలింగ్, నీరా నుంచి తేనె దాని అనుబంధ ఉత్పత్తులు తయారీ విధా నంపై పలు సూచనలు, సలహాలిచ్చారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో గీత కార్మికులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, నీరా అనుబంధ ఉత్పత్తులు బెల్లం, తేనె, చక్కెర ఇతర అన్ని ంటి అమలు విధానంపై డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవి కాంత్ నేతృత్వంలో అధ్యయన కమిటీని నియమించాలని డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. చెట్టుపై నుంచి పడిన గీత కార్మికుడికి ప్రభుత్వ డాక్టర్ ఇచ్చిన దృవీకరణ పత్రం ఆధా రంగా ఎక్స్‌గ్రేషియాను అందించాలని అధికారులను ఆదే శి ంచారు. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. సీఎం ఆదేశం మేర కు నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్‌ను జులై నాటికి పూర్తి చేసి, ఫు డ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనుమతులు తీసుకుంటున్నారు. నీరా ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ప్రారంభించాలని సూచించారు.