Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి మణుగూరు ఏరియా మే నెల బొగ్గు ఉత్పత్తి 112 శాతం సాధిం చిందని, ఉత్పాదకత 113 శాతం అధిగమించామని ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ తెలిపారు. మంగళ వారం జీఎం కార్యా లయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 96,07,000 ఉత్పత్తి లక్ష్యం కాగా 97,26,233 ఉత్పత్తి సాధించిందన్నారు. అదనంగా 1,19,233 ఉత్పత్తి అధిగమిం చామన్నారు. మొత్తం ఉత్పత్తి సామర్థ్యంలో మణుగూరు ఏరియా ముందంజలో ఉందని తెలిపారు. రెండు నెలల ఉత్పాదకత 113శాతం సాధించామన్నారు. ప్రధానంగా ఓసీ 4, పీకే ఓసీ, మణుగూరు ఓసీ అధిక ఉత్పత్తిని సాధించాయన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ రోజుకు 12 వేల టన్నుల బొగ్గును సరఫరా చేస్తుందన్నారు. నాలుగు యూనిట్లు రోజుకు 15000 బొగ్గు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏరియా ఆస్పత్రిలో సకల సౌకర్యాలతో అందుబాటులోకి ఆధునిక వైద్యం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో సింగరేణి అధికారులు లలిత్ కుమార్, వెంకట్ రావు, వెంకటరమణ, లక్ష్మీపతి గౌడ్, నర్సిరెడ్డి, ఎస్ రమేష్, మేరీ కుమారి తదితరులు పాల్గొన్నారు.