Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోతు ఎక్కువగా ఉండటంతో నీటమునిగి..
నవతెలంగాణ-జక్రాన్పల్లి
చేపల వేటకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతిచెందిన విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కోలిప్యాక్లో మంగళవారం జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిల్లలు కృష్ణవేణి (12), మౌనిక (13), శీరిష.. చేపలు పట్టేందుకు ఊరి చివరలో గల చెక్ డ్యామ్ వద్దకు వెళ్లారు. కృష్ణవేణి, మౌనిక చెక్డ్యాంలోకి వెళ్లగా.. లోతు తెలియక నీటిలో మునిగి మృతి చెందారు. ఒడ్డుమీదున్న శీరిష ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో గజ ఈతగాళ్లు వచ్చి మృతదేహాలను వెలికి తీశారు. దాంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.