Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు ఉపకులపతి డీఎస్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అఖిల భారత గీతం ప్రవేశ పరీక్ష (గాట్-2022 )ని దేశవ్యాప్తంగా 83 కేంద్రాలలో మే 20-26 వరకు నిర్వహించామని గుర్తు చేశారు. 25 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారని అన్నారు. గతనెల 27న ఫలితాలను వెల్లడించామన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు admissions.gitam.eduకు లాగిన్ అవ్వాలని సూచించారు. అక్కడ ప్రవేశ పరీక్ష ఫలితాలతోపాటు స్కాలర్షిప్ వివరాలనూ పొందుపరిచామని చెప్పారు. గీతం ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, సైన్స్, ఫార్మసీ, మేనేజ్మెంట్, లా, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, పబ్లిక్ పాలసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని ఆయన వివరించారు. అత్యుత్తమ ప్రతిభా వంతులకు ప్రవేశ రుసుములో పూర్తి రాయితీ ఉంటుందని అన్నారు. ర్యాంకులను బట్టి 75 శాతం, 50 శాతం, 25 శాతం, 15 శాతం రాయితీలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. బీటెక్‌లో ప్రవేశం పొందే విద్యార్థులకు 2022లో నిర్వహించే జేఈఈ మెయిన్, టీఎస్ ఎంసెట్, ఏపీ ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా మొదట వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం పద్ధతిపై స్కాలర్షిప్లు మంజూరు చేస్తామని చెప్పారు. గాట్-2022 తొలివిడతలో మొత్తం మూడువేలమంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రకటించామన్నారు. వారిలో 1,410 మంది తెలంగాణ విద్యార్థులని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గీతం అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ సి ఉదయకుమార్, అడ్మిషన్స్ హెడ్ డాక్టర్ కె శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.