Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ అరెస్టులకు వామపక్షాల ఖండన
- గుడిసెలేసుకున్న పేదలకు పట్టాలివ్వాలి
- డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హన్మకొండ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న సీసీఐ(ఎం), ఎంసీపీఐ(యూ) నాయకుల అక్రమ అరెస్టులను వామపక్ష పార్టీలు ఖండించాయి.ఈ మేరకు తమ్మినేని వీరభద్రం (సీపీఐఎం),చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), పోటు రంగారావు (సీపీఐఎంఎల్ ప్రజాపంథా), సాధినేని వెంకటేశ్వరరావు (సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ), జెవి చలపతిరావు (సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ), మురహరి (ఎస్‌యూసీఐసీ), జానకి రాములు (ఆరెస్పీ), బి సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), జి రవి (ఎంసీపీఐయూ), రాజేష్ (సీపీఐఎంఎల్ లిబరేషన్) బుధవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను పోలీసులు బుల్డోజర్లతో కూలగొట్టి, తగులబెట్టారని తెలిపారు. మహిళలను, పిల్లలని కూడా చూడకుండా గుడిసెవాసులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుడిసెలు వేసుకున్న ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దందా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. కానీ పేదలు గుడిసెలు వేసుకుంటే మాత్రం వారిని అక్కడి నుంచి తరిమేయడం దారుణమని పేర్కొన్నారు. ఇండ్ల పట్టాలు, ఇండ్లు ఇవ్వాలని కోరుతూ హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తలపెట్టిన ధర్నాలో పాల్గొనడానికి వెళ్తున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి సుదర్శన్‌రావును మార్గం మధ్యలోనే పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించ డాన్ని తీవ్రంగా ఖండించారు. ఎంసీపీఐ(యూ) హన్మకొండ జిల్లా నాయకులు కూసం బుచ్చయ్య, ముందు భద్రయ్యను, సీపీఐ(ఎం) నాయకులు ఎస్ వాసుదేవరెడ్డి, చుక్కయ్య, ఉప్పలయ్య, వీరన్న, వెంకట్లతోపాటు, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల నాయకులను, కార్యకర్తలను దొరికినవారిని దొరికినట్టుగానే పోలీసులు అరెస్టు చేశారని విమ ర్శించారు. నిరసనలు తెలియజేసే హక్కు కూడా తప్పు అన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరి స్తున్నదని తెలిపారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలనీ, గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టా లిచ్చి, వారికి డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాల ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ నిర్బంధాన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేశారు.