Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశానికి అభివృద్ధి నమూనాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమం, అభివదిల్ధో పరుగులు తీస్తుందన్నారు. వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పించన్లు తదితర పథకాలను ప్రస్తావించారు.