Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సివిల్స్‌లో 117 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికైన ఎస్సీ గురుకుల విద్యార్థి ఆకునూరి నరేష్‌కు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో నరేష్ .... కొప్పులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువ కప్పి సన్మానించారు. అనంతరం మంత్రితో కలిసి ఆయన అల్పాహారం స్వీకరించారు. నరేష్ ఆరు నుంచి పదో తరగతి వరకు నర్సంపేటలోనూ, ఇంటర్మీడియట్ రంగారెడ్డి జిల్లా చిలుకూరు గురుకుల పాఠశాలలోనూ చదువుకున్నారు.