Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 32 ప్రధాన రైల్వే స్టేషన్లలో కాంట్రాక్టర్లకు అప్పగింత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వేóలోని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో 32 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ-వెహికల్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఆ సంస్థ బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నందున రైల్వే స్టేషన్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగా హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ వద్ద ఈ-వెహికల్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. వీటివల్ల రైల్వేకు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు.
32 రైల్వే స్టేషన్ల జాబితా
1. హైదరాబాద్ 2. బేగంపేట్ 3. హైటెక్ సిటీ 4. వరంగల్ 5. పర్లివైద్యనాథ్ 6. ఖమ్మం 7. డోర్నకల్ 8. తాండూరు 9. జమ్మికుంట 10. బీదర్ 11. మంచిర్యాల 12. వికారాబాద్ 13. చిత్తాపూర్ 14. కాజీపేట 15. భద్రాచలం రోడ్ 16. బెల్లంపల్లి 17. జనగాం18. పెద్దపల్లి 19. కరీంనగర్ 20. సిర్పూర్ కాగజ్‌నగర్ 21. మధిర 22. భువనగిరి 23. లాతూర్ రోడ్ 24. బాల్కి 25. ఫతేనగర్ 26. ఘట్కేసర్ 27. లక్డికపూల్ 28. మహబూబాబాద్ 29. నెక్లెస్‌రోడ్ 30. సంజీవయ్య పార్క్ 31. సేరం 32. జహీరాబాద్.