Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేతి వత్తిదారుల సమన్వయ కమిటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హన్మకొండ కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి సంబంధించి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లా పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని రాష్ట్ర చేతి వత్తిదారుల సమన్వయ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈమేరకు బుధవారం ఆ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవి రమణ, రాష్ట్ర నాయకులు పి.ఆశయ్య, లెల్లెల బాలకష్ణ, ఉడుత రవీందర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామనే హామీని విస్మరించిందని పేర్కొన్నారు. ఇంటి స్థలం ఇవ్వాలని కోరిన నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపడం ప్రభుత్వ తరం కాదని హెచ్చరించారు.
కేవీపీఎస్ ఖండన
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌తోపాటు ఇతర నేతలను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెేవీపీఎస్) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈమేరకు బుధవారం సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌వెస్లీ, స్కైలాబ్‌బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. పేదలకు ఇంటి స్థలం కావాలని అడుగుతున్నందుకు నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. వరంగల్ పేదలకు ఇండ్ల స్థలాలకు పట్టాలివ్వాలని డిమాండ్చ చేశారు.
గుడిసెవాసులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి : మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్
వరంగల్ జిల్లాలో పేదలకు ఇండ్ల స్థలాలకు పట్టాలివ్వాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నాకు బయలుదేరిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర రాష్ట్ర నాయకత్వాన్ని అరెస్టు చేయడాన్ని మహిళా సంఘాల ఐక్యవేదిక నాయకులు మల్లు లక్ష్మి, అరుణజ్యోతి(ఐద్వా), సంధ్య (పీవోడబ్య్లూ), ఝన్సీ(పీవోడబ్య్లూ), రమాదేవి (పీవోడబ్య్లూ), కృష్ణకుమారి, జ్యోతి (ఎన్ఎఫ్ఐడబ్య్లూ) ప్రేమపావని (ఏఐటీయూసీ) బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు కూల్చడం, కాల్చడం అరెస్టులు చేసి, కేసులు పెట్టడం అనేది ప్రజా స్వామ్యమా? అని ప్రశ్నించారు. వెంటనే గుడిసెలు వేసుకున్న పేదలందరికీ డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.