Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నేపాల్లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు బాలలకు బంగారు పతకాలు లభించాయి. సౌత్ ఏషియా ఫెడరేషన్ ఫర్ ఆల్ స్పోర్ట్స్ సంస్థ ఆధ్వర్యాన నేపాల్ అంతర్జాతీయ కరాటే పోటీలు ఖాట్మండులో జరిగాయి. ఈ పోటీలకు భారత్తో పాటు నేపాల్, శ్రీలంక, బర్మా, బంగ్లాదేశ్, ఇండోనేషియాకు చెందిన దాదాపు 200 మందికి పైగా కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. సీనియర్, జూనియర్, సబ్జూనియర్స్ స్థాయిల్లో ఈ పోటీలు జరిగాయి. పదేండ్లలోపున్న నగరానికి చెందిన బాలలు ఈ పోటీల్లో సబ్జూనియర్స్గా రంగంలోకి దిగి ఇతర దేశాలను క్రీడాకారులను మట్టి కరిపించి బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన జి. హేమ్ రెండు బంగారు పతకాలను గెలుపొందగా.. కౌశిక్ సింగ్ రెండు బంగారు పతకాలను, నితీశ్ యాదవ్ ఒక బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వీరికి హైదరాబాద్ స్కూల్ ఆఫ్ షావోలిన్ నింజా ప్రధాన శిక్షకుడు, ప్రముఖ కరాటే క్రీడాకారుడు జి. అజిత్ వీరికి శిక్షణనివ్వటమే కాకుండా హైదరాబాద్ టీంకు నేతృత్వం వహిం చారు. దేశం నుంచి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొచన్నారు. విజేతలకు సౌత్ ఏషియా ఫెడరేషన్ ఫర్ ఆల్ స్పోర్ట్స్ చైర్మెన్ నిషాద్ రషీద్ పతకాలను బహూకరించి అభినందనలు తెలియజేశారు.