Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ది ఆసియా యూనివర్సిటీ ర్యాంకుల్లో భారత్ మూడోదేశంగా అవతరించింది. టాప్ వంద ర్యాంకుల్లో భారతదేశంలో బెంగుళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) 42వ ర్యాంకులో నిలిచింది. కర్నాటకలోని మైసూర్లో ఉన్న జేఎస్ఎస్ అకాడమి ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 65వ స్థానం పొందింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రోపర్ 68వ ర్యాంకు, ఐఐటీ ఇండోర్ 87 ర్యాంకుల్లో నిలిచాయి. ది ఆసియా యూనివర్సిటీ ర్యాంకులు-2022 ఫలితాలను ఫుజితా ఆరోగ్య విశ్వవిద్యాలయంలో గతనెల 31 నుంచి గురువారం వరకు నిర్వహించిన సమ్మిట్లో విడుదల చేసింది. 31 దేశాల నుంచి 616 విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. భారత్ నుంచి గతేడాది 62 విద్యాసంస్థలు ప్రస్తుతం 71 విద్యాసంస్థలు భాగస్వామ్యమయ్యాయి. టాప్ 50 ర్యాంకుల్లో భారత్ నుంచి బెంగుళూరుకు చెందిన ఐఐఎస్సీ నిలిచింది. టాప్ 200 ర్యాంకుల్లో గతేడాది భారత్ విద్యాసంస్థలు 18 ఉంటే ప్రస్తుతం 17 మాత్రమే ఉన్నాయి. 14 విద్యాసంస్థలు గతేడాది, ఇప్పుడు ర్యాంకుల జాబితాలో స్థానం పొందాయి.