Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల ఐదో తేదీన మోడల్ టెట్ నిర్వహించనుంది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈనెల ఐదో తేదీన ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నమూనా అర్హత పరీక్ష (మోడల్ టెట్) నిర్వహించనున్నట్టు తెలిపారు. 33 జిల్లాల్లో 64 కేంద్రాల్లో మోడల్ పరీక్ష తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల్లో నిర్వహిస్తున్నామనీ, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 ఉంటుందని వివరించారు. నమూనా పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు శనివారం సాయంత్రంలోపు ఆన్లైన్లో https://pragathividyaniketan.com/utf_tet/demo.php పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుని హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచిచారు. ఇతర వివరాల కోసం ఆయా జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు/ సెంటర్ కోఆర్డినేటర్లను సంప్రదించాలని కోరారు.