Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంస్కతిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలి : ఎన్పీఆర్డీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల్లో దాగున్న కళానైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటి సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్టు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య ఒక ప్రకటనలో తెలిపారు.వికలాంగుల్లో కళా నైపుణ్యం ఉన్నవారు అనేక మంది ఉన్నారనీ, వారిని ప్రోత్సహించేందు కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వారి కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కళాకారుల కోటాలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సాంస్కృతిక సారథిలో వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.వికలాంగుల కళాకారులందరికీ సాంస్కృతిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. యాబైఏండ్లు పైబడిన కళాకారులందరికీ పింఛన్లు మంజూ రు చేయాలని డిమాండ్ చేశారు వికలాంగ కళాకారులకు పూర్తి సబ్సిడీతో వాయిద్య పరికరాల కొనుగోలు కోసం రుణం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంక్షే మ పథకాల్లో కళాకారుల కోటలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనీ,వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. సకలంగ కళాకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలన్నింటినీ వికలాంగులందరికీ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జంగయ్య, చంద్ర మోహన్, యాదయ్య, పర్మెష్, లలిత, రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ వికలాంగుల సాంస్కృతిక వేదిక (ఎన్పీఆర్డీ) నూతన రాష్ట్ర కన్వీనింగ్ ఎన్నిక
గౌరవ సలహాదారుగా వెన్నెల వెంకటేష్, కన్వీనర్ ఎర్పుల జంగయ్య, కో కన్వీనర్ చంద్రమోహన్, శ్రీనివాస్,లలిత, అంజన్ శ్రీ, కె వెంకట్. కమిటీ సభ్యులుగా: గోపి, శంకర్, యాదయ్య, రమేష్, పరమేష్ ఎన్నికయ్యారు.