Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలో సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్నట్టు నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్వైకెఎస్) రాష్ట్ర డైరెక్టర్ విజయరావు తెలిపారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్లోని సంజీవయ్య పార్కులో సైకిల్ ర్యాలీలు ఉంటాయని చెప్పారు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు సంజీవయ్య పార్కు వద్ద ర్యాలీని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, గచ్చిబౌలి స్టేడియంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఎ.గాంధీ ప్రారంభించనున్నారు.