Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థులకు ఉచిత సేవలు అందించనున్నట్టు ఎడ్యు2టెక్ డైరెక్టర్ బి హరికాంత్రెడ్డి చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ), యునైటెడ్ కింగ్డమ్ (యూకే), కెనడా వెళ్లే విద్యార్థుల కోసం గురువారం హైదరాబాద్లో అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ విద్యకు సంబంధించిన కన్సల్టెన్సీ సేవలను ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు సుమారు ఐదు వేల మంది విద్యా ర్థులు విదేశాలకు వెళ్లారని వివరించారు. విద్యార్థులు ఏ దేశానికి వెళ్తున్నారో అందుకు సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు వీసా, ఇమ్మిగ్రేషన్ సేవల నూ అందిస్తామని చెప్పారు. ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ప్రశాంత్ నట్వర్లాల్ అజ్మీరా హైదరాబాద్కు వచ్చారని అన్నారు. కెనడా, యూఎస్ఏ, యూకేతో పాటు యూరోపియన్ దేశాల్లో ఇమ్మిగ్రేషన్, పర్మినెంట్ సెటిల్మెంట్కు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారని వివరిం చారు. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తమ సంస్థ www.edu2tek.com వెబ్సైట్ను లేదా 9959862565 నెంబర్ను సంప్రదించాలని కోరారు.