Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ల ఇబ్బందులకు కేసీఆరే కారణం : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేసీఆర్ ఒంటెద్దు పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు పోరాడి సాధించామా అని ప్రజలు, ఉద్యమకారులు బాధపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో నాగోల్‌లోని జే కన్వెన్షన్‌లో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన సభను నిర్వహించారు. మూర్ఖపు సీఎంని, టీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపాలన్నారు. ఉద్యమ ద్రోహులే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్‌పై పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం నిర్వహించడం సంతోషకరమన్నారు.ఉద్యమ సమయంలో ఒక్క ఉద్యోగి కూడా ఆత్మహత్య చేసుకోలేదనీ, నేడు 317 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. నేడు రాష్ట్రాన్ని దండుపాళ్యం బ్యాచ్ పాలిస్తున్నదని విమర్శించారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. సర్పంచ్ల ఇబ్బందులకు కేసీఆరే కారణమన్నారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే ఒప్పుకుని సైన్ చేయడం దారుణమన్నారు. ఉద్యమకారులను బయటకు గెంటేసి ద్రోహులందరికీ మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ..అప్పటి సీఎం చంద్రబాబును పదవి నుంచి దింపేందుకు కేసీఆర్ 60 మంది ఎమ్మెల్యేలను కూడగట్టాడని ఆరోపించారు. జ్యోతుల నెహ్రూ గ్రహించి కేసీఆర్ ఎత్తుగడలను చిత్తుచేశాడన్నారు. రవీంద్రనాయక్ మాట్లాడుతూ..కేసీఆర్ వల్ల హైదరాబాద్‌లోని తన ఆస్తులను అమ్ముకున్నానని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్, ీ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.