Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతీయ తపాలా శాఖలో వారు కమిషన్ ఆధారంగా తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించడానికి ఏజెంట్లను నియమిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 50 ఏండ్ల మధ్య ఉన్న నిరుద్యోగ యువత, మాజీ జీవిత బీమా సలహాదారులు, ఏదైనా బీమా కంపెనీ మాజీ ఏజెంట్లు, మాజీ సైనిక ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, హైదరాబాద్ నగర ప్రాంతంలో ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆసక్తి కలిగినవారు తమ దరఖాస్తులను సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్, గాంధీనగర్‌కు జూన్ పదో తేదీలోపు పంపించవచ్చు. ఎంపిక చేసిన అభ్యర్థులు జూన్ 15వ తేదీన ఉదయం 10 గంటలకు సంబంధిత సర్టిఫికెట్స్‌తో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సికింద్రాబాద్ తపాలా సీనియర్ సూపరింటెండెంట్ కె.సంతోష్ నేత ఒక ప్రకటనలో తెలిపారు.