Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దనున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏటీఎస్) ఆధ్వర్యంలో సీఎం కప్ క్రికెట్ టోర్నీని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, షూటింగ్ ఛాంపియన్ ఈషా సింగ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. సీఎం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిద్దేందుకు టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. టోర్నీలో పాల్గొం టున్న జట్ల క్రీడాకారులతో డ్రగ్స్ కు దూరంగా ఉండా లని ఆయన ప్రతిజ్ఞ చేయించారు. టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయన్నారు. టీజీఓ, టీఎన్జీవో, తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్, హైదరాబాద్ సిటీ పోలీస్, డాక్టర్స్, సెలెబ్రిటీస్, ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల జట్ల క్రీడాకారులు పాల్గొ న్నారని తెలిపారు. కార్యక్రమం లో శాట్స్ చైర్మెన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, టూరిజం చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, హాండ్ బాల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రావు,టీజీఓ అధ్యక్షురాలు మమత, పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, ఎంబీ కృష్ణ యాదవ్, డాక్టర్ హరికృష్ణ, వెంకటయ్య, వెంకట్ గండూరి, తమటం లక్ష్మణ్ గౌడ్, నందా పాండే, వెంకటేష్, వివిధ జట్ల కెప్టెన్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.