Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అనతి కాలంలోనే రాష్ట్రం ఎంతో అభివృదిని సాధించిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్లోని మహిళా కమిషన్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆమె అవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు సునితా తెలిపారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రం ఏర్పడిందని, అమరుల త్యాగ ఫలితమే ఈ రాష్ట్రమని తెలిపారు. అనేక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలను ప్రత్యేకంగా గౌరవిస్తూ వారికి సమాన హక్కులు కల్పిస్తున్నదని గుర్తుచేశారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షీ టీమ్లు, భరోసా సెంటర్లు, సఖి సెంటర్లు ఏర్పాటు చేసిందని తెలిపారు.ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చిందని గుర్తుచేశారు.కార్యక్రమంలో కమిషన్ సభ్యురాలు షాహిన్ ఆఫ్రొజ్, కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.