Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరితహారం నిర్వహణ అటవీశాఖకు గర్వకారణం : పీసీసీఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అడవుల శాతాన్ని 33 శాతానికి పెంచేదాకా అటవీశాఖ అధికారులంతా నిబద్ధతతో పనిచేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్ఎం. డోబ్రియల్ పిలుపునిచ్చారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. దేశంలోనే ప్రశంసలు పొందుతున్న పథకాల్లో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఒకటిగా నిలవటం గర్వకారణంగా ఉందని చెప్పారు. దేశంలో అటవీశాఖకు ఏ ప్రభుత్వమూ ఇవ్వనంత ప్రాధాన్యతను రాష్ట్ర సర్కారు ఇస్తోందనీ, పర్యావరణ ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అడవుల రక్షణకు జంగల్ బచావో -జంగల్ బడావో నినాదం తీసుకున్నారని తెలిపారు.