Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎండీ జి రఘుమారెడ్డి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాష్ట్రంలో నిత్యవెలుగులు కొనసాగాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మెన్ జి రఘుమారెడ్డి కోరారు. రాష్ట్ర అవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం హైదరాబాద్లోని ఆ సంస్థ్థ ప్రధాన కార్యాలయంలో జెండా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆవిర్భావంనుంచి సంస్థ అభివృద్ధిలో గణనీయమైన వృద్ధి సాధించామని తెలిపారు. రూ 12,913 కోట్ల వ్యయంతో పంపిణి వ్యవస్థను పటిష్టపరిచామన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 5,661 మెగా వాట్లుగా ఉన్న గరిష్ట డిమాండ్ 14,160 మెగా వాట్లకు చేరిందనీ, 1,356 యూనిట్లుగా ఉన్న తలసరి వినియోగం 2021 సంవత్సరానికి 2,012 యూనిట్లకు చేరిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కొత్తగా సుమారు 35 లక్షల కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. పంపిణి, విద్యుత్ ్ ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాల స్థాయిని గణనీయంగా తగ్గించామని చెప్పారు. సంస్థ పరిధిలో 215.77 మెగావాట్ల సోలార్ రూఫ్ టాప్ నెట్ మీటరింగ్ సామర్ధ్యం ఉన్నదన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి కొత్తగా 3,417 ఉద్యోగాల భర్తీ చేశామనీ, 10,169 అవుట్ సోర్సింగ్ కార్మికులను ఆర్టిజన్లుగా నియమించామని తెలిపారు. ఇంకా 1000 జూనియర్ లైన్ మెన్, 201 సబ్ ఇంజినీర్, 70 అసిస్టెంట్ ఇంజినీర్ల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి శ్రీనివాస్, కె రాములు, జి పర్వతం, సీహెచ్ మదన్ మోహన్ రావు, ఎస్ స్వామి రెడ్డి, పి నరసింహ రావు, జి గోపాల్, సీజీఎంలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.