Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు
- జిల్లా ఆస్పత్రిలో బాధితులకు పరామర్శ
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
సాగు భూములకు పట్టాలివ్వా లని కోరుతూ శాంతియుతంగా రిలే దీక్షలు చేస్తున్న రైతులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళా రైతులు పార్వతమ్మ, సానమ్మ, బస్సమ్మను రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్తో కలిసి గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చెరుపల్లి పరామర్శించారు. మహిళా రైతులపై దాడి చేయించిన ఎమ్మెల్యే సిగ్గుతో తలదించుకోవాలన్నారు. పేద రైతులు చేస్తున్న పోరాటానికి సీపీఐ(ఎం) అండగా ఉంటుందని, వారికి పట్టాలిచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. రైతులపై దాడి చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. వీరి వెంట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం, నాయకులు గోపాల్, నరహరి తదితరులున్నారు.